ఐసీయూలో దిగ్గజ దర్శకుడు భారతీరాజా.. అభిమానుల ఆందోళన

by Gantepaka Srikanth |

దిగ్గజ దర్శకుడు భారతీరాజా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు.

ఐసీయూలో దిగ్గజ దర్శకుడు భారతీరాజా.. అభిమానుల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ దర్శకుడు భారతీరాజా(Director Bharathiraja) చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. గతనెల 27వ తేదీన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆయన్ను.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తు్న్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. డిశ్చార్జికి కొంత సమయం పడుతుందని వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. కాగా, భారతీరాజా తమిళ సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది అవార్డు వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో నటించిన పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు.

ప్రస్తుతం భారతీరాజా వయసు 84 ఏళ్లు. గత ఏడాది మార్చి నెలకు ముందు వరకు ఆయన చురుకుగా పని చేసేవారు. అయితే.. కుమారుడు, నటుడు మనోజ్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో భారతీరాజా తీవ్రంగా కుంగిపోయారు. ఆయన మానసిక వేదన, వయసు పైబడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.

Next Story