'వంద దేవుళ్లు' డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ

by Pulgam srinivas |

విజయ్ ఆంటోని నటించిన 'వంద దేవుళ్లు' డిజిటల్ హక్కులను జీ5 దక్కించుకుంది.

వంద దేవుళ్లు డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్: విజయ్ ఆంటోని, శ్వాసిక విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'వంద దేవుళ్లు'. ఈ చిత్రంలో అజయ్ ధీషాన్ కీలక పాత్ర పోషించారు. శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బాలాజీ శ్రీరామ్ సంగీతం అందించగా, మీరా విజయ్ ఆంటోని, రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే విడుదలైన చాలా రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీ వేదికను ఖరారు చేసుకుంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకోగా, త్వరలోనే ఈ సినిమాను తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.




Next Story