హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న లయ కూతురు

by Pulgam srinivas |

లయ మాట్లాడుతూ... నా కూతురు శ్లోకకు నటనపై చాలా ఆసక్తి ఉంది, నాలాగే తను కూడా నటి కావాలని అనుకుంటుంది. ఏదైనా మంచి స్క్రిప్ట్ దొరికితే తనని వెండితెరకు పరిచయం చేస్తానని చెప్పుకొచ్చింది.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న లయ కూతురు
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ మంచి దశలో కొనసాగుతున్న సమయంలోనే ఈ నటి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ఈమె విదేశాలకు వెళ్ళిపోయింది. దాంతో పూర్తిగా సినిమాలకు దూరం అయింది. మ్యారేజ్ అయ్యాక ఈమెకు త్వరగానే పిల్లలు పుట్టడంతో వారు ఇప్పటికే పెద్దవాళ్లయ్యారు.

పిల్లలు పెద్దవారు కావడంతో ఇండియాకు తిరిగి వచ్చిన లయ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాల్లో నటిస్తోంది. నితిన్ హీరోగా రూపొందిన తమ్ముడు చిత్రంతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 'నితిన్'కు అక్క పాత్రలో నటించిన లయ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఈ చిత్రం మాత్రం డిజాస్టర్ అయ్యింది. తాజాగా ఈమె శివాజీతో కలిసి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో హీరోయిన్గా నటించింది. పోయిన వారం విడుదలయిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

లయ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అయింది. లయ తాజాగా తన కూతురు సినీ ఎంట్రీ గురించి కూడా కీలక విషయాలను తెలియజేసింది. శ్లోకకు నటనపై చాలా ఆసక్తి ఉంది, నాలాగే నటి కావాలి అనుకుంటుంది. ఇప్పటికే తను అనేక విషయాలపై పట్టు సాధిస్తోంది. శ్లోక గతంలో రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన అమర్ అక్బర్ ఆంథోని సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఏదైనా మంచి కథ దొరికితే తనను నటిగా పరిచయం చేస్తానని లయ చెప్పుకొచ్చింది.

Next Story