- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛావా తర్వాత లక్ష్మణ్ ఉటేకర్ సర్‌ప్రైజ్.. మళ్లీ అదే జంటతో
'లుకా చుప్పి', 'మిమి' వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, తాజాగా 'ఛావా' సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్నారు..

దిశ, వెబ్ డెస్క్: 'లుకా చుప్పి', 'మిమి' వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, తాజాగా 'ఛావా' సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్నారు.. అయితే.. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ, తన తదుపరి ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు లక్ష్మణ్. తాజా సమాచారం ప్రకారం, ఈసారి ఆయన ఓ కొత్త రొమాంటిక్ డ్రామాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. నివేదికల ప్రకారం, లక్ష్మణ్ ఉటేకర్ తన కొత్త సినిమాలో హీరోగా కార్తీక్ ఆర్యన్, హీరోయిన్‌గా కృతి సనన్‌ను తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, కార్తీక్-కృతి కాంబినేషన్ ఇప్పటికే 'లుకా చుప్పి'లో మెప్పించగా, ఆ సినిమా మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరిని ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరపై చూడబోతున్నామని తెలుస్తోంది.
ఈ సారి లక్ష్మణ్ ఉటేకర్ స్టైల్‌కి భిన్నంగా, కథలో తీవ్రతను చేర్చాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో 'లుకా చుప్పి'లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్‌పై హాస్యభరితంగా కథను చూపించిన దర్శకుడు, ఇప్పుడు గ్రామీణ భారతదేశ నేపథ్యంతో, కానీ వైవిధ్యమైన ప్రేమ కథను చెప్పేందుకు సిద్ధమవుతున్నారని బీటౌన్ లో టాక్. కృతి సనన్‌కి 'మిమి' చిత్రం ద్వారా గొప్ప గుర్తింపు లభించగా.. ఆ సినిమాలో నటనకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. ఇక, కార్తీక్-కృతి కాంబినేషన్ 'శెహజాదా'లో కూడా కొనసాగింది, అయితే ఆ సినిమా 'అల వైకుంఠపురములో' రీమేక్‌గా వచ్చింది.
ఈ కొత్త సినిమా.. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్, లక్ష్మణ్ ఉటేకర్ ముగ్గురి మూడో కాంబినేషన్ కావడం విశేషం. ప్రస్తుతం ఈ ఇద్దరు నటులు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వారి డేట్స్ అందుబాటులో ఉన్నతర్వాత షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రేక్షకులకు మరోసారి కార్తీక్-కృతి మ్యాజిక్ చూడబోతున్నామా..? లక్ష్మణ్ ఉటేకర్ తన మార్క్ ఎమోషనల్ టచ్‌తో ఈ కొత్త ప్రేమకథను ఎలా మలచబోతారో చూడాలి మరి..!






