రాజ్ తరుణ్ పేరెంట్స్‌పై లావణ్య దాడి... వెలుగులోకి షాకింగ్ వీడియో !

by velandi.Saikiran |

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో ( Raj Tarun - Lavanya ) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ పేరెంట్స్‌పై ( Raj Tarun

రాజ్ తరుణ్ పేరెంట్స్‌పై లావణ్య దాడి... వెలుగులోకి షాకింగ్ వీడియో !
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్ తరుణ్ - లావణ్య కేసులో ( Raj Tarun - Lavanya ) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ పేరెంట్స్‌పై ( Raj Tarun's parents ) లావణ్య దాడి చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మరోసారి రాజ్ తరుణ్ పేరెంట్స్ పై.. లావణ్య ఆమె తండ్రి రామా రావు ( Rama Rao) దాడి చేసాడు. రాజ్ తరుణ్ తల్లి తండ్రులు ..వృద్ధులు కావడంతో కేర్ టేకర్స్ గా ఉన్న మహిళలపై లావణ్య..ఆమె తండ్రి బూతుల పురాణంతో రెచ్చిపోయారు. మహిళా కేర్‌టేకర్స్ పై చేతులతో దాడి చేశారు లావణ్య, ఆమె తండ్రి రామా రావు.

ఇంట్లోకి వస్తే చంపేస్తాను అంటూ బెదిరింపులకు దిగారు. లావణ్య ఆమె తండ్రి బెదిరింపులతో.. వృద్ధ దంపతులు భయపడిపోతున్నారు. ఇక ఈ వీడియో బయటకు రావడంతో కొత్త అంశాన్ని తెరపైకి లావణ్య తీసుకువచ్చింది. నన్ను వాళ్లు చంపేస్తారని మీడియా ముందుకు వచ్చింది లావణ్య. నటుడు రాజ్‌తరుణ్, అతడి స్నేహితుడు శేఖర్ భాషా తనని చంపేయానుకుంటున్నారని లావణ్య ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. ప్రాణభయంతో బతుకుతున్నానని పేర్కొంది. దింతో రాజ్ తరుణ్ - లావణ్య కేసు మరింత రాజుకుంది. ఈ సంఘటనపై ఇప్పటి వరకు రాజ్ తరుణ్ మాత్రం బయటకు వచ్చి మాట్లాడలేదు.

Next Story