మరదలు కోసం బావా.. లావణ్య ‘సతీ లీలావతి’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

లావణ్య త్రిపాఠి నటిస్తున్న ‘సతీ లీలావతి’ సినిమా ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

మరదలు కోసం బావా.. లావణ్య ‘సతీ లీలావతి’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: మెగా కోడలు, మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ నటి లావణ్య త్రిపాఠి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సతీ లీలావతి’. భీమిలీ కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 8న రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ విడుదల తేదీ లాక్ చేశారు. ఈ మేరకు ఓ క్యూట్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘అంచనాలు మరింత పెరిగాయి! మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మే 2వ తేదీన ఉదయం 10:31 గంటలకు ‘సతిలీలావతి’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.. వేసవిలో వేడివేడి విందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ తెలిపారు. ఇక లావణ్య త్రిపాఠి సినిమా ట్రైలర్‌ను బావా అయిన రామ్ చరణ్ రిలీజ్ చేయబోతుండగా.. ‘మరదలు కోసం బావానా.. ఓకే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తాం’ అంటూ కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story