Lavanya Tripathi: షూటింగ్ సెట్‌లోకి అలా వెళ్లాను అని డైరెక్టర్ సీరియస్ అయ్యాడు.. లావణ్య త్రిపాఠి షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.

Lavanya Tripathi: షూటింగ్ సెట్‌లోకి అలా వెళ్లాను అని డైరెక్టర్ సీరియస్ అయ్యాడు.. లావణ్య త్రిపాఠి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్ర హీరోలుగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం ఎంతో మంది ప్రేమికులను, యూత్‌ను ఆకట్టుకుంది. అలాంటి ఈ చిత్రం జూన్ 13వ తేదీన థియేటర్లలో తిరిగి విడుదల అవుతోంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య.. అప్పుడు షూటింగ్ విశేషాలను పంచుకుంది. ‘ఈ సినిమాలో హీరోలతో సహా.. నేను కూడా మేకప్ లేకుండానే నటించాను. అయితే.. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో ముఖానికి మేకప్ వేసుకొని సెట్‌లోకి వెళ్లాను. దీంతో డైరెక్టర్ హను రాఘవపూడి నా మీదా సీరియస్ అయ్యారు. నా దగ్గరకు వచ్చి జూమ్ చేసి నా ఫేస్ చూపించి.. నీ ముఖంపై పౌడర్ మరకలు చూడు ఎలా కనిపిస్తున్నాయో అని అన్నారు. ఇక వెంటనే వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని మళ్లీ షూటింగ్‌లోకి వెళ్లాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story