Lavanya Tripathi: న్యాయం కోసం పోరాటం మొదలు పెట్టిన లావణ్య త్రిపాఠి.. అసలేం జరిగిందంటే? (ట్వీట్)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మెగా హీరో వరుణ్ తేజ్‌(Varun Tej)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే

Lavanya Tripathi: న్యాయం కోసం పోరాటం మొదలు పెట్టిన లావణ్య త్రిపాఠి.. అసలేం జరిగిందంటే? (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మెగా హీరో వరుణ్ తేజ్‌(Varun Tej)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. గత ఏడాది ఈ అమ్మడు ‘మిస్ పర్‌ఫెక్ట్’(Miss Perfect) వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు మళ్లీ ‘సతీ లీలావతి’(Sathi Leelavathi ) సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది.

తాజాగా, లావణ్య త్రిపాఠి న్యాయం కోసం సోషల్ మీడియాలో పోరాటం చేస్తోంది. ఈ మేరకు xలో ఓ ట్వీట్ కూడా పెట్టింది. అసలు మెగా కోడలు న్యాయ పోరాటం చేయమేంటని ఆశ్చర్యపోతున్నారా. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.. ఓ ప్రముఖ రిపోర్టర్ ముకేష్ చంద్రకర్ చత్తీష్ ఘడ్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. అయితే వృతి పరంగా అతడు రోడ్ల నిర్మాణంలో జరిని భారీ స్కాం‌మ్‌ను ఆధారాలతో బయటపెట్టాడు.

దీంతో అక్కడి లీడర్స్ అతడిని దారుణంగా హతమార్చి సెఫ్టిక్ ట్యాంక్‌లో పడేశారు. ఈ ఘటనపై లావణ్య పోరాటం మొదలెట్టింది. అతడికి న్యాయం చేయాలంటూ xలో హ్యాష్ ట్యాగ్ జోడించి మరీ ముకేష్ చంద్రకర్(Mukesh Chandrakar) పేరును పెట్టింది. ప్రస్తుతంఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి ఘటనల్లో పెద్దగా సెలబ్రిటీలు స్పందించరు. కానీ ఏకంగా లావణ్య పోస్ట్ పెట్టడంతో నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story