- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Varun-Lavanya: తల్లి కాబోతున్న మెగా కోడలు.. లైఫ్‌లో బెస్ట్ రోల్ అంటూ ఎమోషనల్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)ను ప్రేమించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)ను ప్రేమించింది. కొద్ది కాలంపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2023లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత రెగ్యులర్‌గా వెకేషన్స్‌ను వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే లావణ్య తల్లి కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. గత కొద్ది రోజులను సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. తాజాగా, లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. వారిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చిన్ని షూస్‌తో పాటు వరుణ్, లావణ్య కలిసి చేతులు పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాకుండా ‘‘జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించబోతున్నాం. త్వరలో రాబోతుంది’’ అనే క్యాప్షన్ పెట్ట రెడ్ హార్ట్ సింబల్స్ జత చేశారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా మెగా కపుల్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
అలాగే మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తూ.. పెళ్లి తర్వాత నుంచి ఆయన వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ సరైన హిట్ పడకపోవడంతో విజయం కోసం తాపత్రయపడుతున్నాడు. అయినప్పటికీ హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా వరుస ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తండ్రి కాబోతుండటంతో మెగా ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషపడుతున్నారు.






