- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Lavanya Tripathi: చాలా సంతోషంగా ఉందంటూ ఆ ఫొటో షేర్ చేసి శుభవార్త చెప్పిన లావణ్య త్రిపాఠి.. పోస్ట్ వైరల్!

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ‘అందాల రాక్షసి’(Andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించింది. ఇక వీరిద్దరు కొద్ది కాలంపాటు సీక్రెట్‌గా లవ్ చేసుకుని పెద్దలను ఒప్పించి 2023లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి వరుణ్ తేజ్ వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. కానీ లావణ్య మాత్రం సినిమాలకు దూరం అయింది. ఇంట్లోనే ఉంటూ కుటుంబ బాధ్యతలు తీసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు ‘మిస్ ఫర్‌ఫెక్ట్’ (Miss Perfect)వెబ్ సిరీస్ చేసింది.
కానీ ఎలాంటి కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ ఆమెకు కండీషన్స్ పెట్టినట్లు పలు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ వరుణ్ మాత్రం అవన్నీ పుకార్లేనని కొట్టి పారేసి తన కోసం కొత్త కథలు వెతికే పనిలో పడినట్లు వెల్లడించారు. ఇక ఇటీవల ఆమె ‘సతీ లీలావతి’(Sati Leelavathi) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. కానీ షూటింగ్ గురించి మాత్రం లావణ్య వెల్లడించలేదు.
దీంతో అంతా ఆమె అసలు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందా లేదా టైటిల్ పోస్టర్‌తోను సరిపెడుతుందా అనే అనుమానంలో ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, లావణ్య త్రిపాళి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభవార్త ప్రకటించింది. ‘సతీ లీలావతి’ షూటింగ్ స్టార్ట్ అయినట్లు వెల్లడించింది. ‘‘సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. అంతేకాకుండా షూటింగ్ సెట్ నుంచి ఫొటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం లావణ్య పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.