Lavanya: అడవుల్లో ఎండిపోయిన రొట్టెలు తింటున్న వీడియో షేర్ చేసిన లావణ్య.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-30 09:20:18  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మెగా హీరో వరుణ్ తేజ్‌(Varun Tej)కు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

Lavanya: అడవుల్లో ఎండిపోయిన రొట్టెలు తింటున్న వీడియో షేర్ చేసిన లావణ్య.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మెగా హీరో వరుణ్ తేజ్‌(Varun Tej)కు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్న మొదటి సినిమా ‘సతీలీలావతి’(Sati Leelavati)తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది. ఇక లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, మెగా కోడలు ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. అడవుల్లో ఇండియన్ ఆర్మీ ఎండిపోయిన రొట్టెలు తింటున్న వీడియో షేర్ చేస్తూ ‘‘వారి గుండె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు అయ్యో పాపం అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి యావత్ భారతీయులను కలచివేసింది.

ఇందులో అమాయకపు పర్యాటకులను దాదాపు 26 మందిని ప్యాంట్స్ విప్పించి మరీ హిందువులను కన్ఫర్మ్ చేసుకుని కాల్చేశారు. జమ్మూకాశ్మీర్ అందాలను చూడటానికి వెళ్లిన పెళ్లైన కొత్త జంటలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనపై లావణ్య వరుస పోస్టులు పెడుతోంది. అయితే ఆమె పెట్టే పోస్టులు జనాలను ఆలోచింప చేస్తున్నాయి. లావణ్య పెట్టే ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తోంది. కాగా, వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. ఆయన పెళ్లైన కానుంచి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కానీ హిట్ అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాడు.

Next Story