Varun Tej-Lavanya: తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి.. పోస్ట్ వైరల్.. మెగా కపుల్‌కు కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు!

by Mallepaka Hamsa |

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Varun Tej-Lavanya: తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి.. పోస్ట్ వైరల్.. మెగా కపుల్‌కు కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది కాలం పాటు వీరిద్దరు సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపారు. ఇక 2023 నవంబర్ 1న ఈ లవ్ బర్డ్స్ ఇటలీలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి మెగా ఫ్యామిలీతో పాటు పలువరు సినీ సెలబ్రిటీలు సైతం వెళ్లారు. ఇక అప్పటి నుంచి మెగా కోడలు లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల ‘సతీ లీలావతి’ చిత్రాన్ని ప్రకటించింది.

అయితే షూటింగ్ జరుపుకుంటున్న ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది మట్కా, ఆపరేషన్ వాలెంటైన్ వంటి మూవీస్ చేశారు. కానీ విజయం సాధించలేకపోయాడు. ప్రస్తుతం వరుణ్, మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘VT-15’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో రితికా నాయక్( Ritika Nayak ) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మెగా కపుల్ లావణ్య,వరుణ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే వీరిద్దరు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు నెట్టింట పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. అందుకే లావణ్య సోషల్ మీడియాకు, ఇండస్ట్రీకి దూరం అయిందనే చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారట. లావణ్య తల్లి కాబోతుండటంతో మెగా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం గురించి తెలుసుకున్న మెగా అభిమానులు కంగ్రాట్స్ వరుణ్ అన్నా అని కామెంట్లు చేస్తున్నారు. వరుణ్, లావణ్య తల్లిదండ్రులు కాబోతున్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Next Story