- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lavanya Tripathi: బుక్ చదువుతూ బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన మెగా కోడలు.. వావ్ సో క్యూట్ అంటూ నెటిజన్ల కామెంట్స్ (వీడియో)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆమె మెగా హీరోను వరుణ్ తేజ్(Varun Tej)ను ప్రేమించింది. ఇక కొద్దికాలంపాటు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న వీరిద్దరు ఇటలీలో 2023లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయిన ఆమె ‘మిస్ ఫర్‌ఫెక్ట్’(Miss Perfect) సిరీస్ చేసింది. ఈక్రమంలోనే.. లావణ్య సినిమాలకు దూరం కానుందని వార్తలు రావడంతో ‘సతీ లీలావతి’ (Sati Leelavati)చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించింది.
ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ తన బిడ్డ కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటూ అనుభూతిని ఆస్వాదిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, లావణ్య త్రిపాఠి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. బ్లాక్ కలర్ థీమ్‌తో డ్రెస్, వాచ్ అన్ని అదే రంగు ధరించిన ఆమె బేబీ బంప్‌తో కనిపించింది. ఇక ఇందులో ఇంటి బయట ఉన్న గార్డెన్‌లో పడుకుని ఓ బుక్ చదువుతూ కనిపించింది. ఇందులో బేబీ బంప్‌ను కలర్ చేసుకున్నప్పటికీ కనిపింస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు వావ్ చాలా బాగున్నారు.. మీ బేబి బంప్‌ను చూస్తూ ఉండిపోయాం అని హార్ట్ సింబల్స్ షేర్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం భగవద్గీత చదివితే పుట్టబోయే బిడ్డకు బాగుంటుందని అంటున్నారు.






