- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15 మంది ఒకేసారి దాడి... నార్సింగి PSకు లావణ్య
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ( Raj Tarun), లావణ్య ( Lavanya) కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. మొన్నటి వరకు ఈ

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ( Raj Tarun), లావణ్య ( Lavanya) కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. మొన్నటి వరకు ఈ వివాదం చల్లబడిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి.. రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ... మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ లోని ( Hyderabad)... నార్సింగి పోలీస్ స్టేషన్ కు ( Narsingi Police Station ) హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య వెళ్ళింది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు ( Raj Tarun's family members), అనుచరులపై ఫిర్యాదు చేసింది.
బుధవారం రోజున కోకాపేట ( Kokapet) ఇంటి వద్ద జరిగిన గొడవపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు... కాసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ కు చేరుకుంది లావణ్య. 15 మందితో కలిసి... రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ( Raj Tarun's Parents ) తనపై దాడి చేశారని లావణ్య సంచలన ఆరోపణలు చేస్తోంది. ఆ ఇల్లు రాజ్ తరుణ్ తాత ముత్తాతలది కాదని స్పష్టం చేస్తోంది లావణ్య. పని దౌర్జన్యంగా తన పైన 15 మందితో దాడి చేసి... ఇల్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని ఈ సందర్భంగా పేర్కొంది.
ఈ దాడి పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన లావణ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో... హీరో రాజ్ తరుణ్ అలాగే ఓ బిగ్ బాస్ బ్యూటీ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారని.. కూడా పేర్కొంది లావణ్య. వాళ్ళిద్దరి మధ్య కొన్ని రోజులుగా సంబంధం ఉందని తెలిపింది. కానీ ఇప్పటికి కూడా రాజ్ తరుణ్ తనకే కావాలంటూ మొదటికి వచ్చింది లావణ్య.






