- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sharwanand: ‘Sharwa38’ లోడింగ్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్
చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘Sharwa37’తో బిజీగా ఉన్నప్పటికీ ‘Sharwa38’కు సంబంధించి లేటెస్ట్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘Sharwa38’ లుక్ లాక్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ (April) నుంచి స్టార్ట్ కానుందని తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో శర్వాను బ్యాక్ నుంచి చూపిస్తుండగా.. మరో ముగ్గురు తన ఎదురుగా నిలబడి చూస్తున్నారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతోంది. ‘Sharwa38’ అనే వర్కిగ్ టైటిల్‌తో సిద్ధం అవుతోన్న ఈ చిత్రానికి సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వం వహిస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీ 1960 చివరలో తెలంగాణ-మహారాష్ట్ర (Telangana-Maharashtra) సరిహద్దులోని జరిగిన సంఘటన ఆధారంగా రాబోతుంది. దీనికి భీమస్ సెసిరోలె సంగీతం అందిస్తుండగా.. మరిన్ని వివరాలు త్వరలో తెలపనున్నారు మేకర్స్.
కాగా.. త్వరలో శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, అడ్వెంచర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ‘దర్శనమే’ అంటూ సాగే ఈ సాంగ్ ఏప్రిల్ 7న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధిచిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
#Sharwa38 LOOK LOCKED & LOADING with the shoot from this APRIL 🔥🔥🔥#SharwaSampathBloodFest 💥 pic.twitter.com/DRFCvbd5sW
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 30, 2025






