Sathyaraj: ఫైనల్ దశకు చేరుకున్న కట్టప్ప మూవీ.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర బృందం

by sudharani |
Sathyaraj: ఫైనల్ దశకు చేరుకున్న కట్టప్ప మూవీ.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర బృందం
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ మారుతి (Director Maruti) సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న తాజా చిత్రం ‘బార్బరిక్’ (Barbaric). వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తుండగా.. సత్యరాజ్ (Satyaraj), వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ అన్నీ కూడా ‘బార్బరిక్’ చిత్రంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి.

మరీ ముఖ్యంగా టీజర్‌ (teaser)లో సత్యరాజ్ లుక్ అండ్ పాత్ర ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. టీజర్‌లోని విజువల్స్, ఆర్ఆర్, మేకింగ్ స్టాండర్డ్స్ అన్నీ కూడా నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ మేరకు ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని... త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. కాగా.. సత్యరాజ్ బాహుబలి చిత్రంతో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story