- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాపో-22’ నుంచి లేటెస్ట్ పోస్టర్ రిలీజ్.. బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అంటూ హైప్ పెంచుతున్న పోస్ట్
లవర్ బాయ్ రామ్ పోతినేని (Ram pothineni) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22’(Rapo-22).

దిశ, వెబ్‌డెస్క్: లవర్ బాయ్ రామ్ పోతినేని (Ram pothineni) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22’(Rapo-22). అయితే దీనికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి (Mahesh Babu) దర్శకత్వం వహిస్తుండగా.. టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై. రవిశంకర్(Y. Ravi Shanker)లు నిర్మిస్తున్నారు. ఇక ఈచిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్ర బృందం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు మూవీటీమ్. అందులో బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అని చిన్న కుర్రాడు ఉన్న పిక్ షేర్ చేస్తూ.. టైటిల్ గ్లింప్స్ రేపు మార్నింగ్ 10 గంటల 8నిమిషాలకు రాబోతున్నట్లు తెలిపారు. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే చిన్న కుర్రాడి చుట్టూ మొత్తం కాగితాలు గాల్లో ఎగురుతున్నాయి. అలాగే థియేటర్ ముందు ఓ హీరో భారీ కటౌట్ కూడా ఉంది. చుట్టూ జనాలతో అక్కడి కిక్కిరిసిపోయింది. ఫైనల్‌గా పోస్టర్‌ను చూస్తే హీరో కోసం ఏమైనా చేసే ఓ అభిమాని కథ ఈ సినిమా అన్నట్లు తెలుస్తోంది.






