అన్న భార్యను వదలని హన్సిక.. ఏకంగా రూ.2 కోట్లు కావాలంటూ కేస్!

by Chukka Sudharani |

హీరోయిన్ హన్సిక తనపై, తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ, వదిన ముస్కాన్‌పై ఆమె రూ.2 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసింది.

అన్న భార్యను వదలని హన్సిక.. ఏకంగా రూ.2 కోట్లు కావాలంటూ కేస్!
X

దిశ, సినిమా: విడాకుల ఇష్యూ తర్వాత తాజాగా మరోసారి వార్తల్లో నలిచింది హీరోయిన్ హన్సిక. తన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ, వదిన ముస్కాన్‌పై ఆమె రూ.2 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక డిసెంబర్ 2022లో జైపూర్‌లోని ముందోటా కోటలో అత్యంత వైభవంగా సోహైల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ ఈ అందమైన ప్రేమకథ ఎంతోకాలం నిలవలేదు. గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు రాగా.. వాటినే నిజం చేస్తూ రీసెంట్‌గా విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. అయితే.. హన్సిక, సోహైల్ ఇద్దరూ పరస్పర అంగీకాంతో విడాకులు తీసుకోగా.. ఈ సెటిల్‌మెంట్‌లో ఈ హీరోయిన్ ఎటువంటి భరణం, మెయింటెనెన్స్ కోరలేదని తెలిపింది.

కానీ రీసెంట్‌గా మాత్రం రూ. 2 కోట్లు పరువు నష్టం దావా దాఖలు చేసి వార్తల్లో నిలిచింది. తనపై, తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ, వదిన ముస్కాన్‌పై ఆమె రూ.2 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, హన్సిక తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు, ముస్కాన్ హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి పబ్లిక్ స్టేట్‌మెంట్స్ చేయకూడదని తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత వివాదం కోర్టు దాకా వెళ్లడం హన్సిక ఇష్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Next Story