- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అలాంటి పాత్రలో.. రష్మిక ‘మైసా’పై లేటెస్ట్ బజ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ మూవీలో రష్మిక గోండు తెగకు చెందిన గిరిజన మహిళ పాత్రను పోషిస్తున్నది. ఇప్పటికే ఇందులో నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో ఫెరోషియస్ లుక్స్‌లో కనిపించి సర్‌పైజ్ చేసింది ఈ అమ్మడు.. తన కెరీర్‌లో తొలిసారి ఫుల్‌లెంగ్త్ యాక్షన్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై ముందు నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. అందుకోసం తన ఫిట్ నెస్ విషయంలో కూడా పలు కేర్స్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ఇందులో ఆమె నక్సలైట్ పాత్రలో కనిపించనుందని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. వ్యవస్థపై ధిక్కార స్వరం వినిపించే ధీరోదాత్తురాలైన గిరిజన మహిళగా ఆమె పాత్ర అత్యంత శక్తివంతంగా సాగుతుందని టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్‌తో పాటు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. రష్మిక ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆమె పాత్ర తాలూకు అసలైన వివరాలు తెలియాలంటే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.






