- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అండగా ఉంటాం.. ఆందోళన వద్దు: సాయికృష్ణ కుటుంబ సభ్యులకు జగన్ భరోసా
రౌడీ షీటర్, వైసీపీ కార్యకర్త సాయికృష్ణ మిస్సింగ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న కృష్ణలంక పోలీసులు ఆ తర్వాత ఏం జరిగిందనేదానిపై ఉత్కంఠ నెలకొంది....

దిశ, వెబ్ డెస్క్: రౌడీ షీటర్, వైసీపీ కార్యకర్త సాయికృష్ణ మిస్సింగ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న కృష్ణలంక పోలీసులు ఆ తర్వాత ఏం జరిగిందనేదానిపైఉత్కంఠ నెలకొంది. మరోవైపు తమ కుమారుడు సాయికృష్ణ మిస్సింగ్‌పై తల్లి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాయికృష్ణ బతికి ఉంటే తమకు చూపించాలని, చనిపోయి ఉంటే బూడిదైనా ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులకు వైసీపీ నేతలు అండగా నిలిచారు. సాయికృష్ణ మృతిపై విచారణ జరగాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.
సాయికృష్ణ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
అయితే శోకసంద్రంలో ఉన్న సాయికృష్ణ కుటుంబ సభ్యులకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. విజయవాడలోని వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం న్యాయం చేసేవరకూ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సాయికృష్ణ ఘటనపై సీరియస్
మరోవైపు సాయికృష్ణ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐపై వేటు వేశారు. సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.






