70ఏళ్ల స్టార్ హీరోతో ప్రేమలో పడిపోయిన నటి.. సంచలన విషయాలు బయటకు..

by Sujitha Rachapalli |

లోకనాయకుడు కమల్ హాసన్.. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం మొదలుపెట్టి.. డెబ్బై ఏళ్ల వయసులోనూ తన హవా చాటుతున్నారు. నిర్మాతగా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. న్యూటాలెంట్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో

70ఏళ్ల స్టార్ హీరోతో ప్రేమలో పడిపోయిన నటి.. సంచలన విషయాలు బయటకు..
X

దిశ, వెబ్ డెస్క్ : లోకనాయకుడు కమల్ హాసన్.. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం మొదలుపెట్టి.. డెబ్బై ఏళ్ల వయసులోనూ తన హవా చాటుతున్నారు. నిర్మాతగా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. న్యూటాలెంట్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు కానీ ఆయన యంగ్ హీరోగా ఉన్నప్పుడు మాత్రం అమ్మాయిలంటే పడిపోయేవారు. ఇలాంటి వారిలో తాను ఉన్నానని ఈ మధ్య ఓ రియాలిటీ షోలో చెప్పుకొచ్చింది టెలివిజన్ నటి లక్ష్మీ రామకృష్ణన్. ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా చెప్పింది.

కాలేజీ చదువుతున్న రోజుల్లో కమల్ హాసన్ అంటే క్రష్ అని చెప్పింది లక్ష్మీ. తన అభిమానం, ప్రేమను ఆయన ముందు చెప్పుకునేందుకు అవకాశం వచ్చిందని.. కానీ తాను చెప్పేలోపే.. ఆయన చిన్న చెల్లెలి లాంటిదానివి అన్నాడని.. దీంతో తన మనసులోని మాటను చెప్పుకుండానే వెళ్లిపోయానని ఓ ఫన్నీ స్టోరీ చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా, మీడియా కాస్త వక్రీకరించిందని.. చాలా అసహ్యంగా చిత్రీకరించిందని తర్వాత ఆమె బాధపడింది. ఓ రియాలిటీ షోలో ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు చెప్పే ఫన్నీ థింగ్స్ గురించి ఇంత దారుణంగా విమర్శిస్తారా అని బాధపడింది.

Next Story