- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఇప్పటికీ ఆ సవాళ్లు తప్పడం లేదు.. హుమా ఖురేషి సంచలన వ్యాఖ్యలు
హుమా ఖురేషి బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎదురవుతున్న సవాళ్లపై తనదైన స్టైల్లో స్పందించి అందరినీ ఆలోచింపచేసింది.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఇక ఇందులో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా హుమా ఖురేషి బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎదురవుతున్న సవాళ్లపై తనదైన స్టైల్లో స్పందించి అందరినీ ఆలోచింపచేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల ఆలోచనలు మారుతున్నప్పటికీ, హీరోల సినిమాలకు ఇచ్చే భారీ బడ్జెట్‌లు, మద్దతు మాత్రం హీరోయిన్లు చేసే చిత్రాలకు దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మన దేశంలో మహిళా ప్రాధాన్యత ఉన్న ఒరిజినల్ కథలను తెరకెక్కించడానికి ఎంతో అవకాశం ఉందని చెప్పారు. భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, పురాణాలను పరిశీలిస్తే ఎన్నో అద్భుతమైన కథలు దొరుకుతాయని, అందువల్ల ఇతర భాషల చిత్రాలను రీమేక్ చేయడం కంటే, మన సొంత కథలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా లిమిట్స్ ఉంటాయనే పాత ఆలోచనా విధానం ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతోందని హుమా పేర్కొన్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఇప్పటికీ ఆ సవాళ్లు తప్పడం లేదని తెలిపారు. ప్రస్తుతం తాను కూడా సరిగ్గా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నానని చెప్పారు. హీరోల సినిమాలకు కేటాయించే అంత భారీ బడ్జెట్‌లు హీరోయిన్ల మూవీస్‌కి ఇవ్వరని, ఈ వివక్ష బయటకు కనిపించకపోయినా పరిశ్రమలో ఖచ్చితంగా ఉందన్నారు. అయితే ఈ పరిస్థితిని మార్చడానికి కేవలం తను మాత్రమే కాకుండా, తన తోటి నటీమణులు కూడా నిరంతరం శ్రమిస్తూ, సరిహద్దులను దాటి సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కాగా.. త్వరలో హుమా ఖురేషి ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్‌దాస్ కాంబోలో రాబోతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో హుమా ఎలిజబెత్ పాత్రలో కనిపించనుంది. ఆమెతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వాని, తారా సుతారియా నటిస్తున్న ఈ మూవీ జూన్ 4న థియేటర్స్‌లోకి రాబోతోంది.






