- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: మెస్మరైజ్ చేస్తున్న హీరోల లేడీ గెటప్స్.. హృతిక్‌కు ముద్దు, సూర్యకు హగ్గు ఇవ్వాల్సిందే..ఆ హీరోను చూస్తే ఇక ఏమాత్రం ఆగలేరు!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కాలం నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కాలం నడుస్తోంది. ఏ రంగంలో చూసిన దీని గురించే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జనాలను ఫొటోలను ఎడిట్ చేయటం, మార్ఫింగ్ చేయటమే పనిగా మారిపోయింది. పైగా ఆ ఫొటోలు ఒరిజినల్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉండటంతో దీని క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక దీనిని కొందరు ఆకతాయిలు తప్పుగా ఉపయోగిస్తుంటే.. సినీ ప్రియులు మాత్రం తమ అభిమాన హీరో, హీరోయిన్ల ఫొటోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారతీయ సినీ హీరోలు అమ్మాయిలుగా మారితే ఎలా ఉంటుందో ఓ వీడియోను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, టాలీవుడ్‌లో ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, అల్లు అర్జున్, కోలీవుడ్‌లో కమల్ హాసన్, విజయ్ దళపతి, సూర్య, సూపర్ స్టార్ రజనీ కాంత్, మాలీవుడ్‌లో మోహన్‌లాల్, శాండిల్‌వుడ్‌లో యశ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరికి భాషతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఫ్యాన్స్ ఈ హీరోలందరీని అమ్మాయిలుగా మార్చేశారు. ఇక అమ్మాయిలుగా ఈ హీరోల అందం మాటల్లో వర్ణించలేం. అచ్చం అమ్మాయిలుగా చీర కట్టులో చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హీరోయిన్లు కూడా ఇంత అందంగా లేరని, వావ్.. సూపర్‌గా ఉన్నారు, సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.






