- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kushitha Kallapu: ఎక్కువ కట్నం ఇచ్చేవాడినే పెళ్లి చేసుకుంటా !
తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కుషిత కల్లపు. తనకు ఎదురు కట్నం ఇచ్చే వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల తారలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది నటీమణులు చిన్న చిన్న సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారు. మరి కొంత మంది మోడల్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. అలాంటి వారిలో కుషిత కల్లపు ( Kushita Kallapu) ఒకరు. తెల్లగా మెరిసే ఈ అందాల తార కుషిత కల్లపు ఓ మోడల్. ఇప్పుడిప్పుడే నటిగా ఇండస్ట్రీలో ఎదుగుతోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కుషితకు లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అంతేకాదు ఐపిఎల్ లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కు వెళ్తూ ఉంటుంది.
అక్కడ హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. అలాంటి కుషిత కల్లపు, 3 రోజెస్ సీజన్ 2లో ఓ ప్రత్యేక పాత్ర పోషించబోతుందట. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తోంది. అయితే ఈ సందర్భంగా తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కుషిత కల్లపు. తనకు ఎదురు కట్నం ఇచ్చే వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అమ్మాయిలకు ఇప్పుడు బాగా క్రేజ్ ఉందని, అందుకే తనకు కట్నం ఇచ్చే వాడే కావాలంటూ వ్యాఖ్యానించింది. కట్నంతో పాటు తనను చేసుకునేవాడు అందంగా ఉండాలని కూడా పేర్కొంది. దీంతో కుషిత కల్లపు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా 3 రోజెస్ సీజన్ 2 అహలో డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ కానుంది.






