Kusha Kapila: తక్కువ సినిమాల్లో నటించిన స్టార్ బ్యూటీలను మించిన క్రేజ్.. కారణం అదే

by Pulgam srinivas |

సోషల్ మీడియా ద్వారా క్రేజ్. స్టార్ బ్యూటీలకి గట్టి పోటీనిస్తున్న కుశ కపిల.

Kusha Kapila: తక్కువ సినిమాల్లో నటించిన స్టార్ బ్యూటీలను మించిన క్రేజ్.. కారణం అదే
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో అనేకమంది సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలలో అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన రీతిలో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.




అలాంటి వారిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మరియు నటి కుశ కపిల ఒకరు. కుశ కపిల 1989 సెప్టెంబర్ 19న జన్మించారు. ఈమె మొదట సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని, తన ప్రత్యేకమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.




అనంతరం iDiva సంస్థలో కంటెంట్ రైటర్‌గా పనిచేసి తన ప్రతిభను చాటుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని చిత్రాల్లో నటించిన ఈమె, ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఘోస్ట్ స్టోరీస్, మసాబా మసాబా వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించింది.




సినిమాల్లో పెద్దగా నటించకపోయినా, స్టార్ హీరోయిన్ల స్థాయిలో సోషల్ మీడియాలో ఈమెకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.




అందుకు ప్రధాన కారణం, చాలా కాలంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కొనసాగుతూ, ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను అభిమానులతో పంచుకోవడం. ఈ కారణాల వల్ల కుశ కపిల సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

Photos Courtesy: Instagram

Next Story