Kumari 21F: ప్లానింగ్‌లో కుమారి 21F సీక్వెల్!

by Chukka Sudharani |

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘కుమారి 21F’ ఒకటి.

Kumari 21F: ప్లానింగ్‌లో కుమారి 21F సీక్వెల్!
X

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘కుమారి 21F’ ఒకటి. హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ జంటగా నటించిన ఈ చిత్రం లవ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కి ఎంతో మంది యూత్‌ను ఆకర్షించింది. దీనికి పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించగా.. డైరెక్టర్‌ సుకుమార్‌ కథనందించాడు. అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌ రాబోతున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఫిలిమ్ నగర్ నుంచి వార్తల మేరకు.. ‘కుమారి 21F’ సీక్వెల్‌కు ‘కుమారి 22F’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుండగా.. సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ తన కొత్త ప్రొడక్షన్‌ బ్యానర్‌లో నిర్మించనుండటం విశేషం. త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్‌ ప్రకటన ఉండబోతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. అయితే.. కుమారి 21F కు దర్శకత్వం వహించిన డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్‌.. ఇప్పుడు సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తాడా లేదా.. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన మెబ్బా పటేల్ మళ్లీ హీరోయిన్‌గా చేస్తుందా లేదా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story