- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుమారి 21F రీ రిలీజ్ ట్రైలర్ అవుట్.. మళ్లీ థియేటర్లలో హిట్టు పక్కా బాసు అంటూ కామెంట్స్..
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో కొత్త సినిమాల కన్న పాత చిత్రాల రీ రిలీజ్‌లకే అభిమానులు భారీగా క్యూలు కడుతున్నారు. అలా ఇప్పటికే చాలా చిత్రాలు రీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక లవ్ స్టోరీ రీ రిలీజ్‌కు కాబోతుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun), బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) జంటగా నటించిన కుమారి 21ఎఫ్(Kumari 21F) మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. పల్నాటి సూర్య ప్రతాప్(pALNATI sURYA pRATHAP) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లేతో పాటు సహ నిర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే.
2015లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. అయితే ఈ మూవీ జూలై 10న రీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి రీరిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ టీమ్. ఇక ట్రైలర్ ‘కలలుగా మారే ప్రతి జీవితం వెనుక ఒక క్రైమ్ ఉంటుంది’ అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అన్నీ కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని హైలెట్ అని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ కింద నెటిజన్లు మళ్లీ థియేటర్లలో హిట్టు పక్కా బాసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్‌ను చూసేయండి.






