- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kuberaa OTT: ఆ ఓటీటీలోకి ధనుష్ కుబేర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మంచి విజయాన్ని సాధించిన సినిమా కుబేర ( KUBERA). తమిళ హీరో ధనుష్ (

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మంచి విజయాన్ని సాధించిన సినిమా కుబేర ( KUBERA). తమిళ హీరో ధనుష్ ( Dhanush), అక్కినేని నాగార్జున ( Nagarjuna), రష్మిక ( Rashmika) ముగ్గురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. బ్లాక్ మనీని.. వైట్ లోకి ఎలా మార్చాలి..? దానికోసం హీరో ధనుష్ ను ఎలా వాడుకున్నారు ? ధనుష్ కు రష్మిక ఎందుకు సహాయం చేసింది ? అనే అంశాలు చుట్టూ ఈ కుబేర సినిమా కథ తిరుగుతుంది.
చాలా రోజులు గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల... ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తీశారు. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే.. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికి కూడా థియేటర్లలో.. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో కుబేర సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది.
కుబేర సినిమా ఓటిటి ( KUBERA OTT)రైట్స్ భారీ ధరకు అమ్ముడు అయ్యాయని సమాచారం అందుతుంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏకంగా 50 కోట్లకు పైగా డిజిటల్ హక్కులను... అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని అంటున్నారు. జూలై 20 తర్వాత.. ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని కూడా చెబుతున్నారు. దీంతో ఓటీటీలో చూసేందుకు జనాలు... ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.






