OTT లోకి రెండు బ్లాక్ బస్టర్ మూవీలు.. ఎప్పటి నుంచి అంటే ?

by velandi.Saikiran |

హీరో ధనుష్, రష్మిక (Rashmika), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర ( Ku

OTT లోకి రెండు బ్లాక్ బస్టర్ మూవీలు.. ఎప్పటి నుంచి అంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: హీరో ధనుష్, రష్మిక (Rashmika), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర ( Kubera). అవినీతి డబ్బు, బిచ్చగాళ్ళ పరిస్థితులు, తదితర అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాను శేఖర్ కమ్ముల (Shekhar Kammula) చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో జనాలకు కూడా బాగా నచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 130 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇంకా చాలా థియేటర్లలో ఈ సినిమా నడుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో... ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపటి నుంచి కుబేర సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ కుబేర స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

అదే సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ , మంచు మనోజ్ హీరోలుగా వచ్చిన లేటెస్ట్ మూవీ భైరవం. ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు కానీ... కథ బాగుందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా కూడా రేపటి నుంచి ఓటిటిలోకి రాబోతుంది. తెలుగు అలాగే హిందీ భాషల్లో జీ 5 లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక విజయ్ కనకమేడల ఈ సినిమాను తీసిన సంగతి తెలిసిందే.

Next Story