- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"కుబేర" ట్విట్టర్ రివ్యూ..ధనుష్ నాగ్ కాంబోలో హిట్ పడిందా?
తమిళ స్టార్ ధనుష్ హీరోగా, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ ధనుష్ హీరోగా, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. అదే విధంగా జిమ్ సర్బ్, దలీప్ తహిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా భారీ అంచనాల నడుమ కుబేర నేడు థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా చూసినవాళ్లు ఎక్స్‌లో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. కాగా ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
సినిమాకు ధనుష్ నటన మరియు డీఎస్పీ మ్యూజిక్ ప్రాణం పోసినట్టు చెబుతున్నారు. నాగార్జున పాత్రకు సైతం తగిన ప్రాధాన్య ఇచ్చినట్టు చెబుతున్నారు. సినిమా కాస్త లెంథీగా ఉండటంతో పాటు ట్విస్ట్‌లు ఊహించే విధంగా ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉన్నట్టు భావిస్తున్నారు. చివరి 40 నిమిషాలు సినిమాలోని ఎమోషనల్ డ్రామా అదిరిపోయిందంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని బేబీ సీన్ ప్రేక్షకులను కట్టిపడేసిందని తెలుస్తోంది. చాలా సన్నివేశాలను డీఎస్పీ తన మ్యూజిక్‌తో లేపాడని చెబుతున్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల టేకింగ్ మేకింగ్ అద్భుతంగా ఉన్నాయని, ఆయన మరో మంచి సినిమా తీశాడని కామెంట్ చేస్తున్నారు. రైటింగ్‌లో ఆయనకు దండం పెట్టాల్సిందేనని చెబుతున్నారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఐదారు ఎమోషనల్ సీన్లు చూస్తే పైసా వసూల్ సినిమా అనిపిస్తుందని పొగడ్తలు కురిపిస్తున్నారు. రష్మిక ధనుష్ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యిందని ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ధనుష్ మరో నేషనల్ అవార్డు సొంతం చేసుకోవడం పక్కా అని అభిమానులు అంటున్నారు.






