- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కుబేర’ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’(Kubera).

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’(Kubera). శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్. ఈ మేరకు ఈ చిత్రం ఇంకా రిలీజ్ కావడానికి 45 రోజులు మాత్రమే ఉందని తెలుపుతూ కౌంట్ డౌన్ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్. ఇక ఈ పోస్టర్‌లో హీరో ధనుష్, రష్మిక మందన్న ఓ రాయి మీద కూర్చొని ఉన్నారు. ధనుష్ హీరోయిన్ సైడ్ చూస్తుండగా రష్మిక మాత్రం కిందకు చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.






