- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: 'ధురందర్' సాంగ్ షేర్ చేసిన కేటీఆర్..ఫుల్ జోష్ లో ఉన్నాడుగా !
దురంధర్ సినిమాలోని అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ ను షేర్ చేసిన కేటీఆర్.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, దురంధర్ సినిమా గురించి చెబుతున్నారు. ఎవరు ఊహించని కథాంశంతో వచ్చిన ఈ దురంధర్ మూవీ, ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. రణ్‌వీర్ సింగ్, సంజయ్, మాధవన్, అక్షయ్ కన్నా ప్రత్యేక పాత్రలో వచ్చిన ఈ సినిమాను ఆదిత్యధర్ తెరకెక్కించారు. డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. పాకిస్తాన్, ఇండియా మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో ఈ కథాంశం తెరకెక్కించారు. అయితే, దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ పాట మారుమోగుతోంది. అయితే తాజాగా ఇదే పాటను గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు షేర్ చేసి షాక్ ఇచ్చారు. ఎవరిని ఉద్దేశించి ఈ పాటను షేర్ చేశారో తెలియదు కానీ, ఈ పాట మళ్లీ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ పాటను కేటీఆర్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఈ పాటను షేర్ చేయడం పట్ల కూడా కొత్త చర్చ మొదలైంది. క్లిక్






