- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10 ఏళ్లు పూర్తి చేసుకున్న క్షణం.. అన్ని కోట్ల లాభాలతో బ్లాక్‌బస్టర్
క్షణం సినిమా నాలుగు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి, 10.19 కోట్ల షేర్ వసూలు చేసి, 6.19 కోట్ల లాభాలను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్‌బస్టర్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : అడివి శేష్ హీరోగా, ఆదా శర్మ హీరోయిన్ గా రూపొందిన క్షణం సినిమాలో అనసూయ విలన్ పాత్రలో నటించింది. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా 2016 ఫిబ్రవరి 26న విడుదలైంది. ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో సూపర్ కలెక్షన్లను వసూలు చేసి, ఆ సమయంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదలై నేటితో పది సంవత్సరాలు పూర్తయింది. ఈ సినిమా విడుదలై పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 'క్షణం'కి ఆ టైంలో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి? అనే వివరాలను తెలుసుకుందాం.
నైజాం 2.65 కోట్లు, సీడెడ్ 1.55 కోట్లు, ఉత్తరాంధ్ర 1.65 కోట్లు, ఈస్ట్ 0.65 కోట్లు, వెస్ట్ 0.50 కోట్లు, గుంటూరు 0.85 కోట్లు, కృష్ణా 0.79 కోట్లు, నెల్లూరు 0.35 కోట్లు, ఏపీ మరియు తెలంగాణ 8.99 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.20 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 10.19 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
ఈ సినిమా నాలుగు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి, 10.19 కోట్ల షేర్ వసూలు చేసి, 6.19 కోట్ల లాభాలను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్‌బస్టర్ అయింది.






