ఆ చిత్రాన్ని బాలయ్యతో రీమిక్ చేయాలనుకున్నాను.. మళ్లీ అందుకే వెనక్కి తగ్గాను.. కే.ఎస్. రవికుమార్

by Pulgam srinivas |

కె ఎస్ రవికుమార్ మాట్లాడుతూ... 'వరలారు'ను బాలయ్యతో తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాను. కానీ ఆ పాత్రకు అజిత్ తప్ప ఎవరు న్యాయం చేయలేరనే ఉద్దేశంతో వెనక్కు తగ్గాను అని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ చిత్రాన్ని బాలయ్యతో రీమిక్ చేయాలనుకున్నాను.. మళ్లీ అందుకే వెనక్కి తగ్గాను.. కే.ఎస్. రవికుమార్
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో తక్కువ రీమేక్ సినిమాలు చేసిన వారిలో బాలకృష్ణ ఒకరు. బాలయ్య తన కెరీర్లో ఎక్కువ శాతం కొత్త కథలతో రూపొందిన చిత్రాల్లోనే నటించి మంచి విజయాలను అందుకున్నాడు. ఈయన తమిళ దర్శకుడు అయిన కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించాడు. మొదటగా వీరి కాంబోలో జై సింహా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రూలర్ వచ్చింది. ఇది మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ అయింది.

తాజాగా కె.ఎస్. రవి కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో చాలా సంవత్సరాల క్రితం ఆయన తీసిన ఓ చిత్రాన్ని తెలుగులో బాలయ్యతో రీమేక్ చేయాలి అనుకున్నట్లు, కానీ కొన్ని కారణాలవల్ల ఆ ఆలోచనను చివరి నిమిషంలో విరమించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. తాజాగా కె.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ... "నేను చాలా సంవత్సరాల క్రితం అజిత్ హీరోగా వరలారు అనే చిత్రాన్ని రూపొందించాను. అది తమిళ్లో భారీ విజయాన్ని అందుకుంది.

ఆ మూవీ మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత తెలుగులో దాన్ని బాలయ్యతో రీమేక్ చేయాలనుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు అజిత్ కుమార్ తప్ప ఆ పాత్రకు మరెవ్వరూ న్యాయం చేయలేరు అని అనిపించింది. దాంతో బాలయ్యతో ఆ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన విషయంలో నేను వెనక్కు తగ్గాను" అని కె.ఎస్. రవి కుమార్ చెప్పుకొచ్చాడు. 2006లో విడుదల అయ్యి బ్లాక్బస్టర్ అయిన వరలారు చిత్రంలో ఆసిన్, కనిక కీలకపాత్రల్లో నటించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించాడు.

Next Story