- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా అతిపెద్ద మద్దతుదారు, సమస్య పరిష్కారికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ క్యూట్ వీడియో పంచుకున్న నటి
కృతి సనన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కృతి సనన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నేనొక్కడినేతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంది. అటు హిందీలో కూడా జాకీ ష్రాప్ కుమారుడు టైగర్ ష్రాప్ జంటగా హీరోపంతి చిత్రంలో నటించి మెప్పించింది.
ఇదే బాలీవుడ్‌లో కృతి సనన్ ది మొదటి చిత్రం అని చెప్పుకోవచ్చు. తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుణ్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఈమె దిల్ వాటే, దోచేయ్, బరేలీ కి బర్ఫీ, కలంక్, స్త్రీ లుకా చుప్పి, హౌస్ ఫుల్ 4, అర్జున్ పాటియాలా, పతి పత్నీ ఔర్ వో, పానిపట్, హమ్ దో హమారే దో, బచ్చన్ పాండే వంటి సినిమాల్లో నటించి నెటిజన్లను ఆకట్టకుకుంది.
అయితే ఈ బ్యూటీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఓ వైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అయితే నేడు మదర్స్ డే సందర్భంగా ఈ హీరోయిన్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మా ఆనందపు సూర్యుడికి.. మా బలానికి స్తంభాని, నా అతిపెద్ద మద్దతుదారు, అతిపెద్ద విమర్శకుడు! సమస్య పరిష్కారి, నాటక-రాణి! మా ఇంటి తల్లితో పాటు బిడ్డ కూడా.. మేము మీకు తెలిసిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాము.. నీతో పాటుగా తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ ఈ నటి అమ్మతో ఉన్న మెమోరీస్ పంచుకుని రాసుకొచ్చింది.






