ఏప్రిల్ అప్పుడే గడిచిపోయిందా..? లేక నాకు మాత్రమే అలా అనిపించిందా.. ప్రభాస్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kodari Anjali |

నటి కృతి సనన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

ఏప్రిల్ అప్పుడే గడిచిపోయిందా..? లేక నాకు మాత్రమే అలా అనిపించిందా.. ప్రభాస్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నటి కృతి సనన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పనిలో ఉంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు మూవీ నేనొక్కడినేతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంది. అటు హిందీలో కూడా జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాప్ జంటగా హీరోపంతి సినిమాలో నటించింది. ఇదే బాలీవుడ్‌లో కృతి సనన్ ది మొదటి చిత్రం అని చెప్పుకోవచ్చు. తర్వాత టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో చాన్స్ దక్కించుకుంది.

ఆది పురుష్ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ హీరోయిన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఈమె దిల్‌‌‌ వాటు, దోచేయ్, బరేలీ కి బర్ఫీ, కలంక్, స్త్రీ, లుకా చుప్పి, హౌస్ ఫుల్ 4, అర్జున్ పాటియాలా, పతి పత్నీ ఔర్ వో, పానిపట్, హమ్ దో హమారే దో, హీరోపంతి 2, షెహజాదా, భేదియా, గణపథ్ వంటి సినిమాల్లో నటించి నెటిజన్లను ఆకట్టుకుంది.

ప్రజెంట్ కూడా ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘ఏప్రిల్ అప్పుడే గడిచిపోయిందా..? లేక నాకు మాత్రమే అలా అనిపించిందా?’’ అనే క్యాప్షన్ జోడించి.. ఏప్రిల్ నెల మెమోరీస్ పంచుకుంది. ప్రస్తుతం ఈ భామ పంచుకున్న పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story