Kriti Shetty: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయన చిత్రాన్ని 100 సార్లు చూశాను.. కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

‘ఉప్పెన’తో ఒక్కసారిగా టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస పరాజయాలు చవి చూసింది.

Kriti Shetty: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయన చిత్రాన్ని 100 సార్లు చూశాను.. కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘ఉప్పెన’తో ఒక్కసారిగా టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస పరాజయాలు చవి చూసింది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ్ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం తమిళంలో ఈ బ్యూటీ రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలుగులో మాత్రం లాస్ట్‌గా శర్వానంద్ ‘మనమే’ చిత్రంలో మెరిసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తమిళ స్టార్ కార్తీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను కార్తీ సార్‌కి పెద్ద అభిమానిని. ఆయన నటించిన ‘ఆవారా’ సినిమాను వందకు పైగా చూశాను. చూసిన ప్రతిసారి ఆ చిత్రాన్ని ఎంతో ఆస్వాదించాను. హైదరాబాద్‌లో ‘ది వారియర్’ షూటింగ్ సమయంలో ‘పొన్నియిన్ సెల్వన్’ సెట్ మా సెట్ పక్కనే ఉంది. దర్శకుడు లింగుసామి నాతో 'కార్తీని కలవడానికి నిన్ను తీసుకెళ్తాను' అని అన్నారు. కానీ కంటిన్యూస్‌గా షూటింగ్ జరగడంతో నేను ఆయనను స్వయంగా కలవలేకపోయాను. అయితే నదియా మేడమ్ కార్తీ సార్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ నన్ను కూడా మాట్లాడేలా చేసింది.. అప్పుడే నేను ఆయనతో వంద సార్లకు పైగా ‘ఆవారా’ చిత్రాన్ని చూశానని చెప్పాను’ అని తెలిపింది. LINK


Next Story