Kriti Shetty: మళ్లీ ఫామ్‌లోకి కృతి శెట్టి.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

2024లో ‘మనమే’ మూవీ తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు కృతి శెట్టి.

Kriti Shetty: మళ్లీ ఫామ్‌లోకి కృతి శెట్టి.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: 2024లో ‘మనమే’ మూవీ తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈమె.. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ వరుస పరాజయాలు చవిచూడటంతో ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే కృతి శెట్టి ప్రజెంట్ ఓ తమిళ చిత్రం చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. జయం రవి హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జెనీ’.

గణేష్ కె బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటిస్తుండగా.. తాజాగా ఇందులో కృతి శెట్టి కూడా భాగం అయింది. ఈరోజు ఈ హీరోయిన్ బర్త్‌డే కావడంతో ‘జెనీ’ సినిమా టీమ్ నుంచి స్పెషల్ విషెస్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. దీంతో ఈ సినిమాలో కృతి నటిస్తుందని తెలుసుకుని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండా.. ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లింక్

Next Story