టాప్ అండ్ జీన్స్‌లో గత్తరలేపుతున్న కృతిశెట్టి.. మోనిక వైబ్ అంటూ పోస్ట్

by Gugulothu.Kavitha |

‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) గురించి మనందరికీ తెలిసిందే.

టాప్ అండ్ జీన్స్‌లో గత్తరలేపుతున్న కృతిశెట్టి.. మోనిక వైబ్ అంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) గురించి మనందరికీ తెలిసిందే. తన ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది ఈ వయ్యారి. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అయితే వరుసగా మూడు హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ వయ్యారి.. ఆ తర్వాత ఆమె కెరీర్ ఊహించని విధంగా మారిపోయింది.

దీంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) అనే చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ సెప్టెంబర్ 18న ఆడియన్స్ ముందుకు రానుంది. వీటితోపాటు జీని అనే చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా బేబమ్మకు తమిళంతో పాటు మలయాళంలోనూ మరిన్ని ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గామారింది. తాజాగా కృతి తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ టాప్, బ్లూ కలర్ జీన్స్ వేసుకుని గత్తర లేపుతోంది. హెయిర్ లీవ్ చేసుకుని మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేస్తుంది. ఇక వీటికి ‘ఇన్ మై మోనిక వైబ్’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఆ కళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది బేబమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story