Kriti Sanon: కన్ఫ్యూజింగ్ క్యాప్షన్‌‌తో నెట్టింట పోస్ట్ పెట్టిన కృతి సనన్..?

by Kodari Anjali |

హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Kriti Sanon: కన్ఫ్యూజింగ్ క్యాప్షన్‌‌తో నెట్టింట పోస్ట్ పెట్టిన కృతి సనన్..?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) సినిమా నేనొక్కడినే తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మొదటి చిత్రంతోనే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంది. అలు హిందీలో కూడా జాకీ ష్రోఫ్(Jackie Shroff) కుమారుడు టైగర్ ష్రోఫ్ జంటగా హీరోపంతి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ బ్యూటీ తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో అవకాశం కొట్టేసింది.

ఈ మూవీ బాక్సాఫీసు వద్ద అంతగా ఆడలేదు. కానీ కృతి సనన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఈ బ్యూటీ దోచేయ్, దిల్‌వాలే, రాబ్తా, బరేలీ కి బర్ఫీ, స్త్రీ, లుకా చుప్పి, కలంక్, అర్జున్ పాటియాలా, హౌస్‌ఫుల్ 4, పానిపట్, పతి పత్నీ ఔర్ వో, మిమీ, హమ్ దో హమారే దో, బచ్చన్ పాండే, హీరోపంతి 2, భేదియా, షెహజాదా, గణపథ్ వంటి సినిమాల్లో నటించి జనాల మెప్పు పొందింది. ప్రస్తుతం కూడా కృతి సనన్ సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటోంది.

ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కన్ఫ్యూజింగ్ క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. పలు ఫొటోలు పంచుకుని వాటికి.. ‘నువ్వు దేశీ అని చెప్పకు, నువ్వు దేశీ అని చెప్పు’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story