హ్యాపీ బర్త్ డే చెబుతూ అతడితో ఉన్న ఫొటో పంచుకున్న ప్రభాస్ హీరోయిన్..

by Kodari Anjali |

హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

హ్యాపీ బర్త్ డే చెబుతూ అతడితో ఉన్న ఫొటో పంచుకున్న ప్రభాస్ హీరోయిన్..
X

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) సినిమా నేనొక్కడినే తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మొదటి చిత్రంతోనే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంది. అలు హిందీలో కూడా జాకీ ప్రోఫ్(Jackie Shroff) కుమారుడు టైగర్ ప్రోఫ్ జంటగా హీరోపంతి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ బ్యూటీ తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో అవకాశం కొట్టేసింది.

ఈ మూవీ బాక్సాఫీసు వద్ద అంతగా ఆడలేదు. కానీ కృతి సనన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఈ బ్యూటీ దోచేయ్, దిల్వాలే, రాప్తా, బరేలీ కి బర్ఫీ, స్త్రీ, లుకా చుప్పి, కలంక్, అర్జున్ పాటియాలా, హౌస్పుల్ 4, పానిపట్, పతి పత్నీ ఔర్ వో, మిమీ, హమ్ దో హుమారే దో, బచ్చన్ పాండే, హీరోపంతి 2. భేదియా, షెహజాదా, గణపథ్ వంటి సినిమాల్లో నటించి జనాల మెప్పు పొందింది. ప్రస్తుతం కూడా కృతి సనన్ సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటోంది.

ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్లో ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. ఫ్యాన్స్న అలరిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘హ్యాపీ బర్త్ డే సీప్స్’ అంటూ పర్సన్ తో దిగిన ఫొటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story