Kriti Sanon: నా ఫేవరెట్ సీజన్ వచ్చేసిందంటూ చేతిలో మ్యాంగోతో ఊరిళ్లు పుట్టిస్తోన్న హీరోయిన్

by Kodari Anjali |

నటి కృతి సనన్ (Kriti Sanon) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Kriti Sanon: నా ఫేవరెట్ సీజన్ వచ్చేసిందంటూ చేతిలో మ్యాంగోతో ఊరిళ్లు పుట్టిస్తోన్న హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: నటి కృతి సనన్ (Kriti Sanon) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పనిలో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu)మూవీ నేనొక్కడినే తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

తొలి చిత్రంలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంది. అటు హిందీలో కూడా జాకీ ష్రాఫ్(Jackie Shroff) కుమారుడు టైగర్ ష్రాప్ (Tiger Shroff)జంటగా హీరోపంతి (Heropanti) సినిమాలో నటించింది. ఇదే బాలీవుడ్‌లో కృతి సనన్ ది మొదటి చిత్రం అని చెప్పుకోవచ్చు. తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan India Star Prabhas) సరసన ఆదిపురుష్ (Adipurush) చిత్రంలో చాన్స్ దక్కించుకుంది.

ఆదిపురుష్ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఈమె దిల్ వాటే (Dil vaṭe), దోచేయ్, బరేలీ కి బర్ఫీ (Bareilly ki Barfi), కలంక్, స్త్రీ, లుకా చుప్పి (cuppi), హౌస్ ఫుల్ 4, అర్జున్ పాటియాలా (Arjun Patiala), పతి పత్నీ ఔర్ వో (Pati patni aur vo), పానిపట్..

హమ్ దో హమారే దో (Hum do hamare do), హీరోపంతి 2,, బచ్చన్ పాండే (Bachchan Pandey), షెహజాదా, భేదియా (Bhedia), గణపథ్ వంటి సినిమాల్లో నటించి నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రజెంట్ కూడా ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ ఫేమ్ సంపాదించుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా మ్యాంగో తింటోన్న ఫొటోలు అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్‌కు కృతి సనన్.. ‘‘ఇష్టమైన సీజన్ వచ్చేసింది.. మీరు మీ గురించి ఆలోచించినప్పుడు మీ మనసులోకి ఏమి వస్తుంది? నాకు అంతగా అర్థం కాని సమాధానం ఇవ్వండి’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

Next Story