- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సినిమా: హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon).. ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఇటీవల ‘తేరే ఇష్క్ మే’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు తన తదుపరి చిత్రానికి సిద్ధం అయినట్లు తెలుస్తున్నది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్న లేటెస్ట్ మూవీ ‘కాక్‌టెయిల్ 2’. 2012లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘కాక్‌టెయిల్’ (Cocktail) మూవీకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కబోతున్నట్లు సమాచారం.
దీనికి హోమీ అడాజానియా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ కానున్నట్లు టాక్. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి సనన్‌ను ఫిక్స్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి టాక్. ఇప్పటికే కథ చెప్పగా కృతి కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. హిట్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న కాక్‌టెయిల్ సీక్వెల్‌లో హీరోయిన్‌గా కృతి ఫిక్స్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. దీనిపై ఇంకా అదికారిక ప్రకటన రావాల్సి ఉంది.






