Kriti Sanon : ట్రోలర్స్ లక్ష్యం అదే.. అందుకే పట్టించుకోను అంటూ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) ప్రజెంట్ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.

Kriti Sanon : ట్రోలర్స్ లక్ష్యం అదే.. అందుకే పట్టించుకోను అంటూ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) ప్రజెంట్ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇటీవల ‘తేరే ఇష్క్ మే’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కాక్‌టెయిల్-2లో ఆఫర్ అందుకున్నట్లు టాక్. హోమీ అడాజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆగస్టు లాస్ట్‌లో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ అమ్మడు ఫోటో షూట్స్‌పై, లేదా సినిమాలపై అప్పుడప్పుడు నెట్టింట విమర్శలు వెల్లు వెత్తుతాయి. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. తనను ట్రోల్స్ చేసే వారిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘సోషల్ మీడియాలో వచ్చే పాజిటివ్, నెగిటివ్ వ్యాఖ్యలు నన్ను ఏ రకంగా ప్రభావితం చెయ్యవు. ఎందుకంటే నేను వాటిని పట్టించుకోను. ఎవరైనా తమ బాధలను చెప్పుకున్నప్పుడు.. వాటి గురించి తెలియనప్పుడు మనం ఎందుకు స్పందించాలి. అసలు ట్రోలర్స్ ముఖ్య లక్ష్యం వాటిపై మనం స్పందించడం. అందుకే నేను స్పందించను. సోషల్ మీడియా నాకు కేవలం నా అభిమానలుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం మాత్రమే. సినిమాలతో పాటు నా అభిమానులతో కనెక్ట్ అవ్వడం ఇష్టం.. కానీ మీ ట్రోలర్స్ కోసం కాదు’ అని తెలిపింది. లింక్

Next Story