- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అందులో పాల్గొనలేక ఏడ్చేశాను’.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
నటి కృతిసనన్(Actress Kritisanan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: నటి కృతిసనన్(Actress Kritisanan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ కథానాయికగా ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. ప్రజెంట్ ఈ బ్యూటీ హీరోయిన్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా విజయం అందుకుంటోంది. ఈమె ముఖ్య పాత్రలో నటించి.. నిర్మించిన సినిమా దో పత్తి(Do patti) నెట్ ఫ్లిక్స్ వేదికన రిలీజ్ అయి.. హిట్ కొట్టింది. ఇందులో ఈ హీరోయిన్ ద్విపాత్రిభినయంలో నటించి ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈ సినిమాకు శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహించగా.. కాజోజ్, బ్రిజేంద్ర(Brijendra), షహీర్ షేక్(Shaheer Sheikh), తన్వీ అజ్మీ(Tanvi Azmi తదితరులు ముఖ్యపాత్రలో నటించారు.
కృతి నిర్మాతగా చేసిన మొదటి సినిమా ఇది. అయితే తాజాగా ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. సినిమా ప్రమోషన్స్‌లో హాజరవ్వడం ఎంత కష్టమో వివరించింది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు.. అలాగే నటీనటులు అంతా సినిమా ప్రమోషన్లో పాల్గొంటారు. కానీ ప్రచారంలో పాల్గొనడం చాలా కష్టమైన పని అని వెల్లడించింది. భేడియా(Bhedia) మూవీ కోసం ప్రమోషన్స్‌లో పాల్గొనలేక ఏడ్చానంటూ పేర్కొంది. ఆ సమయంలో చేతినిండా సినిమాలున్నాయని.. మరోవైపు ఈ మూవీ ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందని.. వరుస ఇంటర్వ్యూలు, రియాలిటీ షోలకు వెళ్లడం.. అంతేకాకుండా ప్రముఖ నగరాల్లో ప్రెస్‌మీట్లు నిర్వహించడం.. ఇలా రాత్రంతా ప్రయాణం చేసేదాన్ని వెల్లడించింది.






