స్టార్ డైరెక్టర్ కుమారుడితో కృతిశెట్టి రొమాన్స్.. ఐరన్ లెగ్ బలే ఛాన్స్ కొట్టేసిందిగా..!

by Chukka Sudharani |

ఇండియా టాప్ మోస్ట్ డైరెక్టర్స్‌లో ఒకరిగా వెలుగుతున్న దర్శకుడు శంకర్ వారసుడు ఆర్జిత్ శంకర్ ఇప్పుడు ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు.

స్టార్ డైరెక్టర్ కుమారుడితో కృతిశెట్టి రొమాన్స్.. ఐరన్ లెగ్ బలే ఛాన్స్ కొట్టేసిందిగా..!
X

దిశ, సినిమా: ఇండియా టాప్ మోస్ట్ డైరెక్టర్స్‌లో ఒకరిగా వెలుగుతున్న దర్శకుడు శంకర్ వారసుడు ఆర్జిత్ శంకర్ ఇప్పుడు ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే ఆయన కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొడుకు ఆర్జిత్ శంకర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఆర్జిత్ మొదట్లో దర్శకుడు కావాలనే లక్ష్యంతో అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నప్పటికీ, ఆ తర్వాత 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'లో నటనలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సర్వం సిద్ధం అయింది. ఈ చిత్రానికి అట్లీ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన అశోక్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఇటీవల ఈ చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. 'పాషన్ స్టూడియోస్' సంస్థ నిర్మిస్తోంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 'దళపతి' విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ హాజరై అర్జిత్ శంకర్‌కు శుభాకాంక్షలు తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా.. విడుదల తేదీతో పాటు మిగిలిన వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇందులో కథానాయికగా కృతి శెట్టిని ఎంపిక చేశారు. మొన్నటి వరకు ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగులో అనిల్ రావిపూడి ప్రాజెక్టుతో పాటు తమిళంలో కూడా వరుస ఆఫర్లు అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story