Krishna Vamsi: కోట గారితో అందుకే వివాదం వచ్చింది.. ఎట్టకేలకు ఓపెన్ అయిన దర్శకుడు

by Pulgam srinivas |   (  Updated:2026-04-06 14:29:35  IST  )

కృష్ణవంశీ మాట్లాడుతూ… చాలా సంవత్సరాల క్రితం కోటా శ్రీనివాస రావు గారితో తనకు చిన్న విభేదం ఏర్పడిందని, అనంతరం తాను క్షమాపణ చెప్పగా, ఆయన కూడా దాన్ని స్వీకరించినట్లు చెప్పారు.

Krishna Vamsi: కోట గారితో అందుకే వివాదం వచ్చింది.. ఎట్టకేలకు ఓపెన్ అయిన దర్శకుడు
X

దిశ, వెబ్ డెస్క్: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ కొంతకాలం క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు కోటా శ్రీనివాస రావుతో తనకు ఏర్పడిన వివాదంపై క్లారిటీ ఇచ్చారు. కృష్ణ వంశీ మాట్లాడుతూ… తాను రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసే కాలం నుంచే కోటా శ్రీనివాసరావు గారితో పరిచయం ఉందన్నారు. ఆయన ఒక గొప్ప నటుడని, తాను దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో కూడా కోటా శ్రీనివాసరావు నటించారని, అయితే ఒక సందర్భంలో తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని తెలిపారు.

తాను కొంచెం సైలెంట్‌గా ఉండి ఉంటే ఆ వివాదం అంతగా పెరగకుండా ఉండేదని అన్నారు. చాలా సంవత్సరాల క్రితం డబ్బింగ్ ఆర్టిస్ట్ గోగినేని ప్రసాద్‌తో కలిసి ఒక వెబ్‌సైట్ ప్రారంభించినట్లు, ఆ సమయంలో తెలుగు సినిమా పరిశ్రమలో మరింత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు రావాల్సిన అవసరం ఉందని, ప్రతి సినిమాలో ఆరుగురు, ఏడుగురు మాత్రమే అవకాశాలు పొందుతున్నారని తాను వ్యాఖ్యానించానని తెలిపారు.

అయితే ఆ వ్యాఖ్యలు కోటా శ్రీనివాసరావు గారికి తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరని అన్నట్లుగా చేరడంతో ఆయన అపార్థం చేసుకున్నారని కృష్ణవంశీ వెల్లడించారు. తాను ఎవరినీ తప్పుగా అనలేదని, కానీ ఆ అపార్థం వల్ల తమ మధ్య విభేదాలు వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత తాను ఆ విషయంలో చాలా బాధపడి కోటా శ్రీనివాసరావు గారికి క్షమాపణ చెప్పానని, ఆయన కూడా దాన్ని స్వీకరించారని చెప్పారు. అనంతరం తాను దర్శకత్వం వహించిన రాఖీ చిత్రంలో కోటా శ్రీనివాసరావు నటించారని, ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు రాలేదని కృష్ణవంశీ వెల్లడించారు.

నన్ను, నా హీరోయిన్‌ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ షాకింగ్ కామెంట్స్

Next Story