కృష్ణ, విజయనిర్మల వాడిన కారు ఇదే.. ఎన్ని కోట్లంటే ?

by velandi.Saikiran |

కృష్ణ, విజయనిర్మల వాడిన కారు వీడియో వైర‌ల్ గా మారింది.

కృష్ణ, విజయనిర్మల వాడిన కారు ఇదే.. ఎన్ని కోట్లంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వస్తూ ఉంటారు పోతుంటారు. కానీ కొంత మంది మాత్రం చరిత్రలో నిలుస్తారు. అలాంటి హీరోనే సూపర్ స్టార్ కృష్ణ. అలనాటి సూపర్ స్టార్ కృష్ణ రేంజ్ ఇప్ప‌టికీ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన హీరోగా రాణించడమే కాకుండా.. తన వారసత్వాన్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. అటు ఆయన సతీమణి విజయనిర్మల కూడా ఇండస్ట్రీలో లెజెండరీ నటిగా, దర్శకురాలిగా రాణించారు. 1967లో వచ్చిన సాక్షి సినిమాలో వీళ్ళిద్దరూ జంటగా కలిసి నటించారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని టాక్. కృష్ణ, విజయనిర్మల ఇద్దరు కలిసి ఏకంగా 47 సినిమాలు చేశారు. అయితే అలాంటి కృష్ణ-విజయనిర్మల వాడిన కారు వీడియో వైరల్ గా మారింది. గత 15 సంవత్సరాల కిందట ఈ కారును కృష్ణ ఫ్యామిలీ కొనుగోలు చేసింది. ఈ బెంజ్ కారును కోటి రూపాయలకు పైగా పెట్టి కొనుగోలు చేసినట్లు తాజాగా నరేష్ వెల్లడించారు. అయితే కృష్ణ-విజయనిర్మల గుర్తుగా ఇప్పటికీ కూడా తన షెడ్డులో ఈ కారు ఉంటుందని వివరించారు న‌రేష్‌. నెలకొక్కసారైనా ఈ కారులో కుటుంబ సమేతంగా ప్రయాణిస్తామని తెలిపారు. దీంతో సూపర్ స్టార్ కృష్ణ వాడిన కారు వైరల్ గా మారింది. క్లిక్

Next Story