సైలెంట్‌గా.. గుట్టుచప్పుడు కాకుండా.. సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన క్రిష్ జాగర్లమూడి!

by Chukka Sudharani |

గమ్యం, వేదం, కంచె వంటి అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. ఇప్పుడు ఓ సరికొత్త చిత్రానికి శ్రీకారం చుట్టినట్లు టాక్.

సైలెంట్‌గా.. గుట్టుచప్పుడు కాకుండా.. సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన క్రిష్ జాగర్లమూడి!
X

దిశ, సినిమా: గమ్యం, వేదం, కంచె వంటి అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. గతేడాది ‘ఘాటీ’ చిత్రంతో వచ్చాడు. స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే.. ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన క్రిష్.. పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా తప్పుకున్నాడు. కానీ ‘ఘాటీ’ కూడా విజయం అందించకపోవడంతో ఈ మూవీ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన ఎటువంటి హడావిడి లేకుండా ఓ సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టినట్లు టాక్. ఈ సారి ఎలాంటి స్టార్స్ లేకుండా.. హైప్ లేకుండా.. ఈశాన్య అడవుల్లో కొత్తవారితో ఓ సర్వైవల్ థ్రిల్లర్‌ను గుట్టుచప్పుడు కాకుండా తెరకెక్కిస్తున్నాడట. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యాకే బిగ్ రివీల్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రస్తుతం నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

Next Story