భర్త మరణాన్ని తట్టుకోలేక కోటా శ్రీనివాస రావు సతీమణి మృతి

by Muthe.Rajitha |

తెలుగు విలక్షణ నటుడు కోటా శ్రీనివాస్ రావు గత నెలలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

భర్త మరణాన్ని తట్టుకోలేక కోటా శ్రీనివాస రావు సతీమణి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు విలక్షణ నటుడు కోటా శ్రీనివాస్ రావు గత నెలలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే భర్త మరణాన్ని తట్టుకోలేక కోటా సతీమణి రుక్మిణి నేడు తుదిశ్వాస విడిచారు. అయితే అంతకుముందే రుక్మిణి అనేక ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురైంది. అదేవిధంగా ఇటీవల జరిగిన భర్త మరణం ఆమెను మరింత కుంగదీసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే కోటా సతీమణి రుక్మిణి సోమవారం ఉదయం మరణించినట్టు తెలిపారు.

అయితే 1973 లో ఆమె డెలివరీ అయినపుడు ఆమె తల్లి మరణించారు. దాంతో తీవ్ర షాక్ కు గురైన రుక్మిణి.. దాదాపు 30 ఏళ్ల దాకా ఎవరినీ సరిగా గుర్తుపట్టలేనంత డిస్టర్బ్ అయింది. కోటా శ్రీనివాస్ చివరి రోజుల్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా వీరి కుమారుడు ఆంజనేయ ప్రసాద్ ఆ యాక్సిడెంట్ లో మృతి చెందాడు. ఇపుడు కోటా.. కొద్దిరోజులకే రుక్మిణి కూడా పరలోకానికి చేరారు.

Next Story